Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీఐకి ఆర్సీలు ఇచ్చిన లారీ యజమానులు
- కార్యాలయం ఎదుట లారీల నిలిపివేత
నవతెలంగాణ- మిర్యాలగూడ
'ట్యాక్స్‌లు తగ్గించండి.. లేదంటే లారీలు మీరే నడపుకోండి' అంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట లారీలను పెట్టి నిరసన తెలిపారు. పెంచిన గ్రీన్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్యాక్స్ తగ్గించండి.. లేదంటే లారీలను మీరే నడపండి.. అంటూ ఆర్సీ పుస్తకాలను ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. పన్నులు రద్దు చేయడంతో పాటు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే వరకు లారీలను ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని కోరారు. పెంచిన పన్నులతో లారీలు నడపడం కంటే.. కూలీ పనులకు వెళ్లడం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటామన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి లారీలు కొనుగోలు చేశామని, ఇప్పుడు పెరిగిన ట్యాక్సీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు నడపలేక.. వాటిపై పన్నులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఫిట్నెస్ రెన్యువల్ చార్జీలను రద్దు చేయాలని, రెండు రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని, పెంచిన ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్ అధికారుల వేధింపులు అరికట్టాలని కోరారు. తైబజార్ రద్దు చేయాలని, 15 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలను జిల్లాలో నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లారీ యజమానులకు మద్దతుగా డీసీఎం యజమానులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నాకు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చాంద్ పాషా, రవీందర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి మేకల సతీష్ మహిమూద్, లారీల యజమానులు రాంరెడ్డి, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, కలిముల్లా, అంజయ్య, నాగేష్ రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, బలరాంగౌడ్, ముత్తిరెడ్డి, ఇ.వెంకటేశ్వర్లు, దేవేందర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, శేఖర్, వెంకన్న, నరసింహ, కోటేష్, నాగరాజు, అరవింద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.