Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ కమిషనర్‌కు టిప్స్ నేతల ప్రశ్న
- కాంట్రాక్టు అధ్యాపకుల ఆవేదన సభ ఉద్రిక్తం
- నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
- నాంపల్లి వద్ద వందలాది మంది లెక్చరర్ల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలను అమలుచేయాలని కోరడం నేరమా?అని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) నేతలు ప్రశ్నించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంటర్ విద్యా కమిషనర్ తీరును తప్పుపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద టిప్స్ ఆధ్వర్యంలో ఆవేదన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది కాంట్రాక్టు అధ్యాపకులు హాజరయ్యారు. కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదనే కారణంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. 'విరు వాంట్ జస్టిస్, సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేయాలి, కాంట్రాక్టు చేశారు. టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం(475) రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, నాయకులు వస్కుల శ్రీనివాస్, శోభన్‌బాబు, జె కురుమూర్తి, కోట్ల శైలజారెడ్డి, లింగంపల్లి దేవేందర్, గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్‌తోపాటు వందలాది మంది కాంట్రాక్టు అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌లోని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
సీఎం జోక్యం చేసుకోవాలి : టిప్స్ నేతలు
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా విషయంలో ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టిప్స్ కన్వీనర్లు రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త జంగయ్య విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. అధికారుల తీరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను వెంటనే ప్రభుత్వానికి పంపించేలా కమిషనర్‌ను ఆదేశించాలని డిమాండ్ చేశారు. క్రమబద్దీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపించాలంటూ ఆవేదన సభను శాంతియుతంగా నిర్వహిస్తే పోలీసులు అక్రమంగా, బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది కాంట్రాక్టు అధ్యాపకులు తరలొచ్చి విజయవంతం చేశారని చెప్పారు.