Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు నల్లగొండ జిల్లకేంద్రంలో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హిల్ కాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డి, అతని భార్య సునీత పేరుమీద లాటరీ పద్ధతిలో తిరుమలగిరి (సాగర్) వైన్‌షాప్ దక్కించుకున్నారు. అప్పటినుంచి నుంచి వైన్‌షాపు సక్రమంగా నడవాలంటే నెలకు రూ.25 వేలు ఇవ్వాలని హాలియా ఎక్సైజ్ సీిఐ యమునాధర్రావు విద్యాసాగర్‌రెడ్డిని వేధిస్తున్నాడు. 8 నెలలకు గాను రూ. 2 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుని మంగళవారం ఏసీబీని ఆశ్రయించిన విద్యాసాగర్ రెడ్డి నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద సీఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టడంతో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకొని అతని అరెస్ట్ చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం హాలియా సీఐ యమునాధర్రావునూ అరెస్ట్ చేశారు.