Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్టుగా ములుగు
- తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు: మంత్రి హరీశ్‌రావు
- ఏడు కోట్ల మంది ధరణి వినియోగిస్తున్నారు: సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ-ములుగు
'ధరణి పోర్టల్ ఒక అద్భుతం. ఓ విప్లవాత్మకమైన చర్య. గత అధికారులు భూముల వివరాలను ధరణిలో సరిగ్గా నమోదు చేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అలా ఎదురైన భూసమస్యలకు పరిష్కారం చూపేందుకు ధరణి పోర్టల్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం' అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులోని రైతువేదికలో మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఉన్నతాధికారులు శేషాద్రి, రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితర అధికారులతో కలిసి ధరణి పోర్టల్‌పై మంత్రి హరీశ్‌రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని రైతుల భూసమస్యలను వంద శాతం పరిష్కరిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ధరణి ఓ విప్లవాత్మకమైన కార్యక్రమం అన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని చెప్పారు. నిజమైన యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశమన్నారు. ధరణి పోర్టల్‌ను ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారని తెలిపారు. భూముల అమ్మకాలు, కొనుగోలు విజయవంతంగా సాగుతోందన్నారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదని, కొన్ని సాంకేతిక సమస్యలే ఉన్నాయని చెప్పారు. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చామన్నారు. వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవు తాయ న్నారు. ఇతర చిన్న చిన్న సమస్యలనూ వందశాతం పరిష్కరిం చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంపీపీ లావణ్య అంజన్‌గౌడ్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహింగీర్, జెడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్, సర్పంచ్ మమత అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఫారెస్ట్ కళాశాలలో ధరణి పోర్టల్‌పై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం, పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఎలా పరిష్కరించాలనే అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.