Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నీ ఫార్మ్‌హౌజ్‌కు ఫ్రీ కరెంటు, కాళేశ్వరం నీళ్లు కావాలి. నీ వ్యవసాయ భూమి నుంచి జానెడు జాగా ఎవ్వరికివ్వవు. ప్రజల ఆస్తులను మాత్రం ఎలా తీసుకుంటామ్ కేసీఆర్?' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లిలో భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. సమస్యవస్తే పిలిచి మాట్లాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదని సూచించారు. ప్రాజెక్టుకు సహకరిస్తామనీ, తమకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు చెబుతున్నా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటన సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బండి సంజరు మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కారే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించిందనీ, జులై 3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జులు సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. సభాస్థలిని రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.