Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాతో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదు..వీఆర్ఎస్ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ సూచించారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆయన మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. సమావేశాల నిర్వహణ కోసం కమిటీలకు అప్పగించాల్సిన బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది నిద్రలో కలలు కంటే..బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు భయపడి కేసీఆర్ బీఆర్ఎస్పేరుతో రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. దేశవ్యాప్తంగా తిరిగి తనను ప్రధానిని చేయాలని వేడుకున్నా మమత, దేవేగౌడ, అఖిలేశ్, కేజ్రీవాల్, తదితరులెవ్వరూ మద్దతు తెలపలేదని చెప్పారు. తాను నెరవేర్చని హామీలపై చర్చించేందుకు కేసీఆర్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఓపెన్ డిబెట్‌కు తమ పార్టీ తరఫున బండి సంజరు వస్తారని తెలిపారు.
జూలై 3న భారీ బహిరంగ సభ : కె.లక్ష్మణ్
హైదరాబాద్‌లో జూలై 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయనీ, మూడో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయాన్ని (శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ భవన్లో)ప్రారంభించామన్నారు. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో నివాసం ఉంటున్న ఆయా రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యేందుకుగానూ ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమావేశాలను నిర్వహిస్తామని చెప్పారు.