Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్తదానం చేసి వారి ప్రాణాలను నిలపాలని ప్రజలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదాతలను సన్మానించారు. మెమెంటోలను అందజేశారు. అందరితో కలిసి మంత్రి రక్తదానం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏడాది నాలుగు లక్షల యూనిట్ల రక్తం అవసరమున్నదనీ, అయితే ప్రస్తుతం మూడు లక్షల ఏడు వేల యూనిట్లు మాత్రమే సేకరించగలుగుతున్నామని చెప్పారు. ప్రాణాలను నిలిపే రక్తదానం అన్ని దానాల కొన్న గొప్పదన్నారు. ఒక మనిషి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో బ్లడ్ సపరేటర్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.