Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బచావో హైదరాబాద్ పేరుతో కాంగ్రెస్‌పార్టీ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నగరంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాజకీయ పార్టీలతో సమావేశం జరగనుంది. వివిధపార్టీలకు చెందిన ముఖ్యనేతలను రేవంత్ ఆహ్వానించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. అయితే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆయన ఫోన్ చేసి సమాచారమిచ్చారు.