Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్
- అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్షను అక్టోబర్ 16న నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. టీఎస్పీఎస్సీ పాలకమండలి సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోటీ, ప్రవేశపరీక్షలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఈ రాతపరీక్ష నిర్వహణకు సంబంధించి విద్యార్థులకు అకడమిక్ పరంగా పరీక్షలు, ఇతర అంశాల వల్ల ఆదివారం ఖాళీగా లేదని తెలిపారు. ఇంకోవైపు చాలా కాలం తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేసిన నేపథ్యంలో చదువుకునేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి అనేక విజ్ఞప్తులొచ్చాయని వివరించారు. తొలుత జులై లేదా ఆగస్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కానీ ఆ విజ్ఞప్తులను పరిశీలించాక కమిషన్ ఇతర తేదీల్లో నిర్వహించడంపై చర్చించామని తెలిపారు. అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు ఆదివారాలు ఖాళీగా లేవని తెలిపారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.