Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రేకులు ఫెయిల్.. అదుపుతప్పిన వాహనం
- ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
- మూడు వాహనాలు ధ్వంసం
- వనస్థలిపురం సుష్మాచౌరస్తా వద్ద ఘటన
నవతెలంగాణ- వనస్థలిపురం
హైదరాబాద్‌లో హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న హెరిటేజ్ పాల కంటైనర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మూడు ద్విచక్రవాహనాలు ధ్వంసమ య్యాయి. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న హెరిటేజ్ పాల కంటైనర్ సుష్మాచౌరస్తా వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయ లేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సిగల్ కూడా పడింది. దాంతో సిగల్ వద్ద కంటైనర్ ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢకొీ ట్టింది. ఆ ద్విచక్రవాహనంపై వెళ్తున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత కంటైనర్ మరో ద్విచక్ర వాహనదారుడైన హయత్ నగర్ మండలం, తొర్రూర్ రాజీవ్ స్వగృహలో నివాస ముంటున్న ఎస్.మురళీ మోహన్‌ను వెనుక నుంచి ఢకొీన్నది. మురళీ మోహన్ పక్కకు దూకి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అతని వాహనం ధ్వంసమైంది. అనంతరం కంటైనర్ నిషాబార్ అండ్ రెస్టారెంట్లోకి దూసుకుపోయి గోడలకు బలంగా ఢకొీట్టి ఆగిపోయింది.
కాగా, మృతులు నల్లగొండ జిల్లా వెంకటేశ్వర కాలనీ (వీటి కాలనీ)కి చెందిన ముమ్మడి విజయలక్ష్మి(42), హయత్‌నగర్ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న బోగోజు సురేష్ కుమార్(47)గా గుర్తించారు.
విజయలక్ష్మి గవర్నమెంట్ టీచర్. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బోగోజు సురేష్‌కుమార్ అగ్రికల్చర్‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్. అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు. సురేష్ కుమార్ తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకులోన్ కోసమని వచ్చి..
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు ముమ్మడి విజయలక్ష్మి బ్యాంకు లోన్ పని నిమిత్తం.. హయత్‌నగర్ రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్న తన అన్న బోగోజు సురేష్ కుమార్ ఇంటికి వచ్చింది. బ్యాంకుకు వెళ్లేందుకు సురేష్ కుమార్ తన వాహనంపై విజయలక్ష్మిని ఎక్కించుకుని బయలుదేరారు. సుష్మా చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగల్ పడటంతో ఆగారు. ఈ సమయంలో కంటైనర్ వేగంగా వచ్చి ఢకొీట్టడంతో ప్రాణం
కోల్పోయారు.