Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళన
- పలు పార్టీ నాయకుల మద్దతు :
- భారీగా పోలీసుల మోహరింపు
నవతెలంగాణ-బాసర
సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూని వర్సిటీ విద్యార్థులు మంగళవారం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. యూనివర్సిటీ అధికారులు ఎంత నచ్చజెప్పినప్పటికీ విద్యార్థులు ససేమిరా అని భైటాయిం చారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి అల్పాహారం చేయకుండానే ఆందోళన బాటపట్టారు. యూనివర్సిటీలోకి మీడియాను సైతం అనుమతించకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీలోని సెల్ టవర్ సిగల్‌ను నిలిపేశారు. భైంసా ఇన్చార్జి డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందస్తుగానే విద్యార్థులు తమ 12 సమస్యలను సోషల్ మీడియా ద్వారా బహిరంగపరిచారు. ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్‌ఛాన్స్‌లర్‌ను నియమించాలని, అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ల్యాప్‌టాప్, యూనిఫామ్ అందించాలని, నాణ్యమైన భోజనం, శుభ్రమైన తాగునీరు అందించాలని తదితర డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టి సంఘీభావంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలోని ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న పలు పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పోలీసుల కండ్లుగప్పి యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని భైంసా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.