Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగులపల్లి టెర్మినల్‌కు 300 ఎకరాలివ్వాలి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భూమి కేటాయించాలనీ, నాగులపల్లి టెర్మినల్‌కు 300 ఎకరాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ వసతి, అప్రోచ్ రోడ్డుకు భూమిని కేటాయించడం ద్వారా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వీలుగా 2023 నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకొచ్చేలా అభివృద్ధి చర్యలను దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్నదని తెలిపారు. భరత్‌నగర్‌లో అప్రోచ్‌రోడ్డును 60 అడుగులకు, ఈసీ నగర్‌వైపు వెళ్లే అప్రోచ్ రోడ్డును 100 అడుగులకు పెంచేందుకుగానూ తగిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని లేఖలో కోరారు.