Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాబోయే తరాల కోసం తమ ప్రభుత్వం నేలను కాపాడుతున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సద్గురు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దీంతో పాటు పశువులు, గొర్ల సంపద పెరిగిందన్నారు. ఆహార భద్రతకు, పర్యావరణ భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.