Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 1,326 డాక్టర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) పోస్టులు, 357 ట్యూటర్లు (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్), 211 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్), ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివేంటివ్ మెడిసిన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు జులై 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ష్ట్ర్్జూర://ఎష్ట్రరతీb.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ అనే వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.