Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కెటి రామారావు భరోసా కల్పించారు. సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడి విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించాలంటూ విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలను పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు లేవనెత్తిన అన్ని అంశాలనూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.