Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయంగా తెలంగాణ స్టార్టప్ ఎకో సిస్టమ్స్ టాప్ 10 ర్యాంక్‌లో నిలిచింది. సరసమైన ప్రతిభా విభాగంలో ఆసియన్ ఎకోసిస్టమ్‌లో ఏకంగా నాలుగో స్థానంలో ఉన్నట్లు ది 2022 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ (జీఎస్‌ఈఆర్) వెల్లడించింది. ఈ వారంలో లండన్‌లో జరిగిన స్టార్టప్ జినోమ్‌లో ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించింది. తెలంగాణ కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్‌లు అంతర్జాతీయంగా పలు విభాగాల్లో టాప్ 20 గ్లోబల్ స్టార్టప్‌లలో లెక్కించబడుతున్నాయని నివేదించింది. నిధుల పరంగా ఆసియాలో టాప్ 15లో స్థానం పొందింది. పరిశోధన, పేటెంట్, విజ్ఞాన కార్యకలాపాల పరంగా ఆసియాలో తెలంగాణ టాప్ 20లో ఒకటిగా ఉంది. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2019 జూలై నుండి 2021 డిసెంబర్ 31 మధ్య 4.8 బిలియన్ల విలువను సష్టించిందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే వినూత్న కల్పనలు అందించడంలో తెలంగాణ స్టార్టప్‌లు ముందు ఉన్నాయని టి హబ్ సీఈఓ ఎం శ్రీనివాస రావు పేర్కొన్నారు.