Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రపంచ వ్యాపంగా రియాల్టీ రంగం కుప్పకూలొచ్చని విద్యుత్ వాహనాల తయారీదారు టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారీ నష్టాలు చోటు చేసుకోవచ్చన్నారు. ముందుగా స్టాక్ మార్కెట్లు, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలు పడిపోతున్నాయని డోజోకాయిన్ సష్టికర్త షిబెటోషి నకమోటో ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. నకమోటో అభిప్రాయంతో ఎలాన్‌మస్క్ ఏకీభవించారు. దీనికి కొనసాగింపునగా ఎలన్ మస్క్ నెక్ట్స్ రియాల్టీ రంగం సంక్షోభంలో పడనుందని ట్వీట్ చేశారు. నకమోటో అభిప్రాయం ప్రకారం ఇప్పటికే స్టాక్‌మార్కెట్, క్రిప్టోలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని వాటి తర్వాత నష్టపోయే రంగం రియల్టీ అంటూ హాలోవీన్ మీమ్ ద్వారా తెలిపారు.