Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనా విధానాలతో ప్రపంచంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి భారతదేశం నెట్టివేయబడిందని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్ష, సమన్వయ ప్రధాన కార్యదర్శులు కే యాదవరెడ్డి, పల్లబ్ సేస్గుప్తా అన్నారు. బుధవారంనాడిక్కడి అమత ఎస్టేట్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన 25 మంది మేధావులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను అభినందిస్తూ, వారికి మద్దతు తెలపాలని కోరారు. మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ జాతీయ నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ కేంద్రం సబ్కా సాథ్, సబ్కా వికాస్ వంటి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో నాయకులు జి రఘుపాల్ నాగేశ్వర రావు, కాచం సత్యనారాయణ, రామ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.