Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఎంత బడ్జెట్ కేటాయించారో, నిధుల కేటాయింపులు చాలినంతగా ఉన్నాయో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. బడ్జెట్ తగినంతగా లేకపోవటంతో మేకుల్లా ఉండే అన్నం, ఉడకని పప్పు, నీళ్లుగా ఉండే పప్పు చారు వడ్డిస్తున్నారనీ, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలను హైకోర్టు పిల్‌గా చేపట్టింది. ఓయూ స్టూడెంట్ బీఏ కుమార్ రాసిన లేఖను పిల్‌గా తీసుకుని దీన్ని విచారించింది. చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా, శిశు సంక్షేమ, ఆర్థిక పాఠశాల విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్లకు నోటీసులిచ్చింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.