Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25, 26 తేదీల్లో ఉర్ధూ జర్నలిస్టులకు....
- మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టులకు శిక్షణా తరగతుల్లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు, 25, 26 తేదీల్లో ఉర్దూ జర్నలిస్టులకు హైదరాబాద్లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉర్దూ పత్రికలు రెండు వందల సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మొదటి రోజు రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రముఖ ఉర్దూ పత్రికల సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీఈవోలు, ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరవుతారని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణా తరగతుల మొదటిరోజు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, నగర ఎమ్మెల్యేలు అతిథులుగా పాల్గొంటారన్నారు. రెండో రోజు మీడియాలో నైతిక ధోరణులు, డిజిటల్ మీడియా, నేర వార్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారాలనే అంశాలపై తరగతులుంటా యని వివరించారు.