Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. వారు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరింది. ఈమేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులు, వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులు తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్‌రన్ నిర్వహించేందు కు కాలువ నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ గుడాటిపల్లి లో ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తమకు పరిహారం ఇవ్వాలంటూ భూనిర్వాసితులు...శాంతియుతంగా నిరసన లు తెలిపారని పేర్కొన్నారు.అయితే న్యాయం కావాలని కోరిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.చట్టం ప్రకారం రైతులకు అన్ని రకాల పరిహారాలను ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభిం చాలని కోరారు.చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో 770 ఎకరాలకు ఇంకా పరిహారం అందలేదని గుర్తు చేశారు. గత 37 రోజులుగా రైతులు నిరహార దీక్షలు నిర్వహిస్తున్నారనీ, ఏదుల రిజర్వాయర్ పరిధిలోని బండరాయి పాకుల నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాస ప్యాకేజీ పూర్తిగా ఇవ్వలేదని పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమి మార్కెట్ విలువకు మూడు రేట్లు కలిపి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. రైతులు, కూలీలు, వృత్తిదారులు, చిరు వ్యాపారులందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాలని కోరారు. పునరావాస గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనీ, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.