Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులను విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర ఆర్జీయూకేటీ విద్యా ర్థులకు మద్దతు తెలపడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగ రాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ అరవింద్, ఇతర వామపక్ష విద్యా ర్థి సంఘాల నాయకులను అక్ర మంగా పోలీసులు అరెస్టు చేశా రని తెలిపారు. ఇది దుర్మార్గపు చర్య అని విమర్శించారు. విద్యా ర్థుల సమస్యలను పరిష్కరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఇంత పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నా అక్కడి వీసీ కనీసం సందర్శించలేదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు.