Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ నిర్మాణాల కూల్చివేత నోటీసులకు జవాబులు ఇచ్చే గడువు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గడువు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత నోటీసులపై చర్యలు ఉండాలన్న తమ ఉత్తర్వులకు పదేపదే అధికారులు ఉల్లంఘిస్తే ఎలాగని ప్రశ్నించింది. ఇదే తీరుగా కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామనీ, జరిమానా విధిస్తామని నొక్కి తెలిపింది. కమిషనర్ల సర్వీస్ రికార్డుల్లో నమోదుకు ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. దీనిపై వచ్చే నెల ఒకటి నాటికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి రిపోర్టు అందజేయాలని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం బుధవారం ఆదేశించింది. తన వాహన పార్కింగ్ షెడ్ తొలగించాలంటూ బొల్లారం మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇవ్వడాన్ని సంతోషిణి సవాల్ చేసిన కేసులో హైకోర్టు పైవిధంగా హెచ్చరించింది. నోటీసును రద్దు చేసింది.
జీవో చెల్లదు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లరు సొసైటీ లిమిటెడ్ పాలకవర్గ గడువు పూర్తి అయ్యిందనీ, అయినా ప్రభుత్వం గడువు పొడిగిస్తూ జీవో నెం.151ని జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన రిట్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సహకార సంఘ చట్ట స్ఫూర్తిని నీరుగార్చేలా జీవో ఉందనీ, అందువల్ల దాని అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ కారణంగా ఎన్నికలు జరగడం ఆలస్యమైందనీ, మూడు లక్షల మంది సభ్యులున్నారని ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పింది.