Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. బుధవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 270కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మాసాగర్లో అత్యధికంగా 8.48 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. 65 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాబోయే మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు, కొన్ని జిల్లాల్లో అకడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. తెలంగాణ మీదుగా కిందిస్థాయి గాలులు గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. బుధవారం నాటికి నైరుతి రుతుపవనాలు కర్నాటక వ్యాప్తంగానూ, మరఠ్వాడా, తెలంగాణ, రాయలసీమ, కోస్తాం ధ్ర,తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి డయ్యూ, నందుర్బార్, పర్బానీ,మెదక్, రెంటచింతల,మచిలీపట్నం మీదుగా వెళ్తున్నది.రాబోయే రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణలోని మరికొన్ని ప్రాంతాలకు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్,బీహార్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.