Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హూతమకి పీపీఎల్ పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో.. విజయం సాధించిన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-ఐడీఏ బొల్లారం
హూతమకి పీపీఎల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కేవీపై సీఐటీయూ ఘన విజయం సాధించింది. పరిశ్రమలో 99 ఓట్లు ఉండగా 99 ఓట్లు పోలయ్యాయి. సీఐటీయూకు 58 ఓట్లు రాగా టీఆర్ఎస్కేవీకి 41 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కేవీ అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు 17 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. ఈ ఘనవిజయం కార్మికులకు అంకితం చేస్తున్నామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను యాజమాన్యంతో కొట్లాడి సాధిస్తామన్నారు. టీఆర్ఎస్కేవీ చేసిన తప్పులు చేయకుండా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి ఇచ్చిన మాట ప్రకారం పని చేస్తామని తెలిపారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయిని నర్సింహారెడ్డి, పరిశ్రమ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్, మల్లేష్, కార్మికులు పాల్గొన్నారు.