Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ నేతలకు మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరి స్తామని పీఆర్టీ యూటీఎస్ నేతలకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కేజీబీవీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేజీబీవీల్లో కేర్టేకర్ల నియామకం, ఫైనాన్షియల్, ఆపరేషనల్ గైడ్‌లైన్స్ మార్పు, 15 సెలవులను ఏడాదిలో ఎప్పుడైనా వాడుకునేలా ఉత్తర్వులివ్వాలంటూ కోరారు. స్పెషల్ ఆఫీసర్ పేరును ప్రిన్సిపాల్‌గా మార్చాలనీ, బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు సరఫరా చేయాలనే అంశాలపై ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, మినిమం టైంస్కేల్ వంటి అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ రమేష్, కేజీబీవీ ప్రతినిధులు ఝాన్సీ, మాధవి, స్వరూప, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.