Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వయోవద్ధుల హెల్ప్‌లైన్, వెబ్సైట్ పోస్టర్‌ను రాష్ట్ర వయోవద్ధుల సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ప్రపంచ వయో వద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారి సంరక్షణ కోసం ప్రస్తుతం రంగారెడ్డి, కరీంనగర్ లో రెండు ఆశ్రమాలు ప్రభుత్వం నడుపుతున్నదనీ, మరో 11మంజూరు చేశామని తెలిపారు.ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన కారణంగా వద్ధు ల్లో చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతు న్నారని చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వద్ధుల ఆర్థిక సహకార సంస్థ రూపొందించిన వెబ్సైట్ షషష ్రరవఅఱశీతీషఱ్ఱఓవఅర. షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ, జాతీయ వయో వద్ధుల హెల్ప్ లైన్ 14567, దివ్యాంగుల హెల్ప్ లైన్ 1800-572-8980 టోల్ ఫ్రీ నెంబర్ల పనితీరును గురించి ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్, సహకార ఆర్థిక సంస్థ కమిషనర్ శైలజ మంత్రికి వివరించారు.