Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- చర్లగూడ రిజర్వాయర్ నిర్వాసితులకు మద్దతు
నవతెలంగాణ- నల్లగొండ
చర్లగూడ భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే వరకూ పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడ రిజర్వాయర్ వద్ద నిర్వాసితులు 37రోజులుగా దీక్షలు చేస్తున్నారు. బుధవారం దీక్షా శిబిరాన్ని రైతు సంఘం ప్రతినిధుల బృందం సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. 2016లో రిజర్వాయర్ పనులు ప్రారంభమైనా ఇప్పటివరకు770 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు.18ఏండ్లు నిండిన యువత అంద రికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పారు. భూములు కోల్పోయిన ప్రజలకు ఇప్పటివరకు పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏడేండ్లు అవుతున్నా పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వనిప క్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చ రించారు. ప్రతినిధుల బృందంలో ఏర్పుల యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, బండ శ్రీశైలం, నాయకులు ముసలయ్య, శ్రీనివాస్ నాయక్, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.