Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని జిల్లాలకూ ఉద్యమాన్ని విస్తరిస్తాం
- సమగ్ర భూ సర్వే చేయాలి..మిగులు భూమి పేదలకు పంచాల్సిందే
- ఈ నెల 20 వరకు జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు
- 20 నుంచి 31వ తేదీ వరకు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతులు
- ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణతో పోరాటం ముందుకు:
వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరంగల్‌లోని జక్కలొద్ది పోరాట స్ఫూర్తి కేంద్రమనీ, అక్కడ పేదలకు సర్కారు ఇండ్ల స్థలాలిచ్చే వరకూ పోరాటం నుంచి వెనక్కి తగ్గేదే లేదని పలువురు వక్తలు స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే చేసి మిగులు భూములను పేదలకు పంచాల్సిందేనని నొక్కి చెప్పారు. లేకుంటే భూమి, ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. 'ప్రభుత్వ నిర్బంధం ఆపాలి..గుడిసెవాసులకు ఇండ్ల జాగాలివ్వాలి' అని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇండ్ల స్థలాల పోరాట వాసులకు సంఘీభావంగా బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) రాష్ట్ర కన్వీనర్ జి. రాములు మాట్లాడుతూ..వరంగల్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. వాటిని రక్షించకుండా కనీసం గూడు లేకుండా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసులతో, గుండాలతో దాడులు చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకుని ఇండ్ల స్థలాల కోసం కలిసికట్టుగా పోరాడాలని ప్రజల కు పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాల కోసం పేదలు చేస్తున్న పోరాటం లో తమ సంఘం ప్రత్యక్షంగా పాల్గొంటుందని హామీనిచ్చారు. టీఎస్ఐపాస్ పేరుతో వందల ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర సర్కారుకు పేదలకు ఇండ్లస్థలాలిచ్చేందుకు భూములు దొరకడం లేదా? అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జి.జగదీశ్ మాట్లాడుతూ..జక్కలొద్దిలోని 298 ఎకరాల ప్రభుత్వ భూమిలో రియల్టర్లు, భూబకాసురుల ఆక్రమణలతో మిగిలింది కేవలం 50 ఎకరాలు మాత్రమేననీ, ఆ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఉందని విమర్శి ంచారు. పోలీసులు అర్ధరాత్రి పూట బుల్డోజర్లు తీసుకొచ్చి 7300 గుడిసెలను కూల్చేసి తగుల బెట్టడం అన్యామన్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రాష్ట్ర సర్కారు పట్టించుకోక పోవడంతో పేదలు అక్కడ గుడిసెలు వేసుకున్నా రని గుర్తుచేశారు. బీకేఎమ్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య మాట్లాడుతూ..కమ్యూనిస్టులకు భూ పోరాటాలు కొత్తేమి కాదని చెబుతూ రైతాంగ సాయుధ పోరాటం, ముదిగొండ తదితర పోరాటాలను వివరించారు. మూడెకరా లిస్తామనీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ మోసం చేశారని విమర్శిం చారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్ మాట్లాడుతూ..పోడు భూముల సమస్యను త్వరితంగా పరిష్కరించా లనీ, పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు, భూమి కోసం జరుగుతున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటు ందని ప్రకటించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌నాయక్ మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం మీద పేదలకు నమ్మకంపోయిందనీ, అందుకే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల కోసం పోరాడు తున్నారని చెప్పారు. నిర్బంధాలు విధించే కొద్దీ ప్రభుత్వానికే నష్టమనే విషయాన్ని కేసీఆర్ గుర్తించి పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ బి.పద్మ, డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు కల్పన, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
పలు తీర్మానాలకు రౌండ్ టేబుల్ ఆమోదం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను రౌండ్‌టేబుల్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సమగ్రభూ సర్వే చేయించి మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు లేని కుటుంబా లు లక్షల్లో ఉన్నాయనీ, ఆ కుటుంబా లకు వెంటనే ఇండ్ల స్థలాలివ్వాలని కోరారు. పోడు రైతులందరికీ హక్కుపత్రాలివ్వాలన్నారు. ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న గుడిసె వాసులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహ రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి 20 నుంచి 31వ తేదీ వరకు ఎమ్మార్వోలు, ఆర్డీఓలు, కలెక్టర్లకు ఇండ్ల స్థలాల కోసం వినతిపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి జూలై నెలలో పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ, ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని తెలిపారు