Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తాం
- రెండోరోజూ బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసన
- కలెక్టర్‌తో పలు దఫాలుగా చర్చలు.. విఫలం
- విద్యార్థి ట్వీట్‌కు కేటీఆర్ రీట్వీట్
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. బుధవారం సైతం ఆందోళన కొనసాగిస్తూ 12 డిమాండ్లను అధికారుల ముందుంచారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ నిరసన కొనసాగుతుందని విద్యార్థులు తేల్చి చెప్పారు. ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపారు. విద్యార్థినులు ఎండలోనే గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఏఎస్పీ కిరణ్ కారే, ఆర్డీఓ లోకేశ్వరరావు, యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ విద్యార్థుల నాయకులతో సమావేశమయ్యారు. పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను చర్చించేందుకు అవకాశం ఇస్తారని కలెక్టర్ తెలిపారు. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని, యూనివర్సిటీలో మరమ్మతుల కోసం రూ.3లక్షల్లోపు అయ్యే పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు అంగీకరించలేదు. రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్, అధ్యాపకుల పోస్టుల భర్తీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
విద్యార్థి ట్వీట్‌కు కేటీఆర్ రీట్వీట్
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి ట్వీట్ చేయగా.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. సమస్యలను సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి, ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్, అధికారులతో విద్యార్థులు చర్చలు జరపాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రు లు అధిక సంఖ్యలో యూనివర్సిటీ వద్దకు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డగించారు. తమ పిల్లలను చూసుకునేందుకు అనుమతి నిరాకరించడంపై తల్లిదండ్రులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.