Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర డైరెక్టర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ పెద్దపల్లి నియమితులయ్యారు. సమస్యలు పరిష్కరించాలంటూ మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రులు కెటి రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి, ఎ ఇంద్రకరణ్‌రెడ్డి సైతం స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అయినా విద్యార్థులు రోజూ నిరసన చేపడుతున్నారు. దీంతో ఆర్జీయూకేటీ బాసర ప్రాంగణం విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్నది. ఇంకోవైపు ఇన్‌ఛార్జి వీసీ రాహుల్ బొజ్జకు ఇతర బాధ్యతలుండడంతో ఆ వర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సతీశ్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బుధవారం విద్యామంత్రితో జరిగిన సమావేశంలో ఆర్జీయూకేటీ బాసరకు సరైన వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించాలంటూ నిర్ణయించామని వివరించారు.