Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ-పాస్ వెబ్ సైట్ లో వివరాలు
- కమిషనర్ బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ధృవపత్రాల పరిశీలన ఈ నెల 20 నుంచి జరుగుతుందనీ, ఈమేరకు వివరాలను ఈ- పాస్ తెలంగాణ వెబ్ సైట్ లో పొందుపరిచామని బీసీ సంక్షేమం కమిషనర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం తెలిపారు. మార్చిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://telanganaepass.cgg.gov. in వెబ్ సైట్ లో పొందు పరిచిన వివరాలు ప్రకారం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. ఈ పథకం కోసం మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 438 మంది బీసీ కులాలకు చెందినవారు కాగా, 133మంది ఇబీసీ కులాలకు చెందిన అభ్యర్థులున్నారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు పంపించామని తెలిపారు. ఆయా తేదీల ప్రకారం హైదరాబాద్లోని సంక్షేమ భవన్లోని ఆరో అంతస్తులో ఉన్న కార్యాలయంలో హజరు కావాలని ఆయన సూచించారు.