Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిపుల్‌ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పదో తరగతి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి సాంకేతిక విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ త్రిపుల్‌ఐటీ అని తెలిపారు. కొన్నేండ్లుగా కనీస సౌకర్యాల్లేక, బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నా రు. నిధులివ్వకుండా ఈ విద్యాసం స్థను పాతరపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థులపై ఆరోపణలు చేయడం వారిని ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.