Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆసరా కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వం అకారణంగా తొలగించిన 13 లక్షల మంది ఆసరా పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకం అందుకుంటున్న వ్యక్తి మృతిచెందితే ఆ కుటుంబంలో అర్హులుంటే పింఛన్ ఇవ్వాలనీ, వయోపరిమితి సడలింపు వలన కొత్త లబ్ధిదారుల సంఖ్య పెరగనున్నందున దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. ఆసరాపించన్ల కొత్త ధరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేసి అర్హులందరికీ జూలై నుంచి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో, సామాజిక సంస్థలతో సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాల్టీల్లో ఆసరాపింఛన్ లబ్దిదారుల, పెండిరగ్ ధరఖాస్తుదారుల జాబితాను బహిరంగంగా నోటీస్ బోర్డుపై పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్ధాంతం : పొంగులేటి
కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్ధాంతమని బీజేపీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై 12 ఏండ్ల కిందనే నేషనల్ హెరాల్డ్ కేసు నమోదైందనీ, పాత కేసు విచారణ జరుగుతుంటే ఈ రాద్ధాంతం ఏంటని ప్రశ్నించారు.
బాసర విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : అర్వింద్
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ డి.అర్వింద్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, సీఎం, మంత్రులు వేరే దేశాలు, రాష్ట్రాల్లో పర్యటించేందుకు డబ్బులుంటాయిగానీ..విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు లేవా? అని ప్రశ్నించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారని నిలదీశారు.