Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో సరోగసీ చట్టం-2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం-2021 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, అథారిటీలను ఏర్పాటు చేసింది. బోర్డుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్మెన్ గా, హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మెన్‌గా,అడిషనల్ సెక్రటరీ కార్యదర్శి గా ఉంటారు.వివిధ విభాగాల కమిషన ర్లు,డైరెక్టర్లు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. అథారిటీకి వైద్యారోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ చైర్మెన్‌గా ఉంటారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైస్ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. వివిధ విభాగాలకు చెందిన ముగ్గురు సభ్యులు ఉంటారు. సరోగసి, కృత్రిమ గర్భదారణ పేరుతో జరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో తెచ్చిన ఈ చట్టాలకు అనుగు ణంగా బోర్డు,అథారిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన బోర్డు సరోగసి ప్రక్రియ లను నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తుంది.