Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ, పీవైఎల్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రద్దు చేయాలని పీడీఎస్‌యూ, పీవైఎల్ డిమాండ్ చేశాయి.ఈమేరకు ఆయా సంఘాల నాయకులు జూపాక శ్రీనివాస్, పి మహేష్, సాయిరెడ్డి, ఇందూరి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ సర్కారు ఆర్మీ నియామకాల్లో పాత పద్ధతిని వదిలేసి,కొత్తగా అగ్నిపత్ రిక్రూట్మెంట్ స్కీమ్ తీసుకురావడం సరైందికాదని పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో ఉన్న ఆవేదన, ఆక్రోశానికి ఈ ఘటనలు నిదర్శనమని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.