Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యారంగంలో మన గురుకులాలు దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రుక్మాపూర్ (కరీంనగర్ ) సైనిక్ పాఠశాల, బీబీనగర్ మహిళా సైనిక్ డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం మార్చి 27న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పిందని తెలిపారు. ఐదు సొసైటీలలో కలిపి మొత్తం 981గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని గుర్తుచేశారు. వీటిలో సుమారు 6లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారనీ, అందరికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ పాఠశాల, సైనిక్ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు చాలా బాగున్నాయని తెలిపారు.వీటిలో విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్నారనీ, వీరికి అత్యుత్తమ అవకాశాలు వస్తాయనీ,చక్కని భవిష్యత్తు ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.