Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు
- టీఎస్‌యూటీఎఫ్ నేతలకు జీఏడీ కార్యదర్శి వివరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అండర్‌టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. ఈ అంశంపై జీఏడీ కార్యదర్శి వి శేషాద్రిని గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి కలిసి చర్చించారు. అండర్‌టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీల దస్త్రం శుక్రవారం పూర్తిచేసి పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు పంపిస్తామన్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి ఉత్తర్వులు రూపొందిస్తారని వివరించారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. పరస్పర బదిలీల కోసం 2,958 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. వారిలో 1,260 మంది మాత్రమే అండర్‌టేకింగ్ ఇచ్చారు.