Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సద్గురు జగ్గీ వాసుదేవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శమని జగ్గీ వాసుదేవ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం పుడమిని కాపాడటమేనని చెప్పారు. ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదనీ, భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. యువ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవ అభినందనీయమన్నారు. మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.