Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నాం
- రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ అభివృద్ధి తక్కువ
- వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పర్యటన
నవతెలంగాణ-కొడంగల్, పరిగి
వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అని ఆరోపించారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ఎంపీ డా. రంజిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వైద్య సిబ్బంది, రోగులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే కొడంగల్ మున్సిపల్లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, కూరగాయల మార్కెట్ భవనాలను, డయాలసిస్ సెంటర్, సీసీరోడ్లు, ట్రైబల్ గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, మున్సిపల్లోని సీసీరోడ్లు, డ్రయినేజీ, చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.. సీఎం కేసీఆర్ వైద్య విద్యను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పాటు ఆయుష్ ఆస్పత్రిని మంజూరు చేస్తామని ప్రకటించారు. వచ్చే సంవత్సరం లోపు మెడికల్ కళాశాలను పూర్తిచేసి అడ్మిషన్లకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి గెలిచి ఉండకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుండేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు-రంగారెడ్డి జలాలను ఈ ప్రాంతానికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రం అమలు చేసే ఏ ఒక్క పథకం అమలు చేయడం లేదన్నారు. త్వరలో అర్హులైన 10 లక్షల మందికి కొత్త పింఛన్లు అందజేస్తామన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు, తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నామన్నారు. జీఎస్ట్టీ గ్రోత్ రేట్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్నారు. ఓర్వ లేక కేరద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి డబ్బులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 వేల కోట్ల ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్మెన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావుకు నిరసన సెగ
పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్ రావు కాన్వారుని యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందే కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులనూ ముందస్తు అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ చందర్‌రెడ్డి, అంజనేయులు, నాగవర్ధన్, కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొ న్నారు. అలాగే కొడంగల్ పట్టణంలో బీఎస్పీ నియో జకవర్గ నేత వెంకటేశ్వర్లను ముందుస్తుగా అరెస్టు చేశారు.