Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తండ్రులకు ఉచిత ప్రయాణం:
- టీఎస్ ఆర్టీసీ ఆఫర్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
ఫాదర్స్ డే సందర్భంగా ఈనెల 19న ఐదేండ్లలోపు పిల్లలతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే తండ్రులకు పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేననీ, తన జీవితాన్ని పిల్లల కోసం ధారపోసి ఎప్పుడూ వెన్నంటే ఉండి నడిపిస్తాడని శుక్రవారంనాడొక పత్రికా ప్రకట నలో ఆయన పేర్కొన్నారు. అందరి జీవితంలో రోల్ మోడల్‌గా నిలిచే పాదర్స్ డే సందర్భంగా నాన్నలకు టీఎస్ ఆర్టీసీ ఈ ఉచిత ప్రయాణ ఆఫర్‌ను ప్రకటించినట్టు తెలిపారు. ప్రేమించటం అమ్మ వంతైతే, దీవిం చటం నాన్న వంతు అనీ, వారిని గౌరవిస్తూ మదర్స్ డే సందర్భంగా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు వివరిం చారు. ప్రయాణీ కులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్ ఆర్టీసీ సామా జిక సేవలో తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. ఫాదర్స్ డే రోజున తండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.