Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, కార్యదర్శి బోయిన్పల్లి రాము శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దేశ విద్రోహక చర్యలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని విమర్శించారు. గతంలో రక్షణ రంగంలోకి 50 శాతానికి పైగా ఎఫ్‌డీఐని ఆహ్వానించారని తెలిపారు. ఇప్పుడు అగ్నిపథ్ పథకం తెచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. సైనిక నియామకాలను యథావిధిగా జరపాలని కోరారు. సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.