Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్లో జరుగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానమే ప్రధాన కారణమని విమర్శించారు. ఈ పథకంపై నిరుద్యోగ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నదని తెలిపారు.