Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. ఆ విద్యార్థులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి కావాలని ఆశించి 2008లో ఈ విద్యాసంస్థను 272 ఎకరాల్లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పేద విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించి భవిష్యత్ ఇంజినీర్లుగా స్థిరపడాలని ప్రారంభించిన ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఈ సంస్థకు పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్‌ను నియమించలేదని విమర్శించారు. 257 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాల్సి ఉండగా కేవలం 15 మందితో నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 1,500 మంది కొత్త విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. ఆరు వేల మంది విద్యార్థులుంటున్నా హాస్టల్ సౌకర్యాలు మెరుగుపర్చడంలేదని పేర్కొన్నారు. మెస్‌లలో టెండర్ల ద్వారా ఇస్తున్న ఆహారంలో నాణ్యత లేదని తెలిపారు. తాగునీరు సరిగా లేదని వివరించారు. పీడీ, పీఈటీలు లేరని పేర్కొన్నారు. నాలుగేండ్ల నుంచి సాంకేతిక విద్యా ర్థులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లనూ ఇవ్వడంలేదని విమర్శించారు. యూనిఫారాలూ లేవని తెలిపారు. ఉన్నత, సాంకేతిక విద్యకు అవసరమైన ప్రాథమిక వసతులూ లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. వారి న్యాయమైన 12 డిమాండ్లు పరిష్కారమయ్యేవరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తు న్నారని తెలిపారు. యూనివర్సిటీ మూడు రోజులుగా పోలీసుల నిర్బం ధంలో ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారని పేర్కొన్నారు. అనేక సమస్యలకు నిలయంగా మారినా యూని వర్సిటీకి బడ్జెట్ కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని విమర్శిం చారు. కేవలం జీతాలకు తప్ప అభివృద్ధికి నిధుల్లేవని తెలిపారు. కావున ఈ విషయంలో సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.