Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పోస్టుల్లో గురుకులాలకు సంబంధించినవే 9,096 పోస్టులున్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులున్నా యి. ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశుసంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, వికలాంగుల శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ బోర్డులో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.