Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల సంఘాల పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ సవరణ చట్టం- 2021 ని పార్లమెంటు వర్షాకాల సమావేశా ల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ 'ఫిక్కీ' సమావేశంలో చెప్పడాన్ని తెలం గాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసి యేషన్ (టీఎస్పీఈఏ), తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్లు (టీఈఈఏ) వేర్వేరు ప్రకటనల్లో తప్పు పట్టాయి. అలాంటి పరిస్థితులే వస్తే విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని టీఎస్పీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రత్నాకర రావు, పీ సదానందం, టీఈఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామేశ్వర శెట్టి పిలుపునిచ్చారు. ఈ బిల్లు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులకు మరణ శాసనం వంటిదనీ, దీన్ని అన్ని స్థాయిల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. లక్షల కోట్లు వెచ్చించి, ప్రభు త్వరంగంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని కార్పొరేట్ల కు అప్పగించేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదనీ, దీన్ని అడ్డుకుంటామని అన్నా రు.ఢిల్లీలో రైతాంగ పోరాటం, మూడు వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా అందిరితో మాట్లాడి, నిర్ణయం తీసు కుంటామని కేంద్రప్రభుత్వం రాత పూర్వకంగా హామీ ఇచ్చిందనీ, ఇప్పు డు దానికి వ్యతిరేకంగా వ్యవహరి స్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఉమ్మడి జాబితాలోని అంశమ నీ, చట్ట సవరణకు వ్యతిరేకం గా తెల ంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకో రని ప్రశ్నించారు. త్వరలో భవిష్యత్ కా ర్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.