Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సికింద్రాబాద్లో ఆందోళన చేస్తున్న యువకులపై రైల్వే పోలీసులు పాశవికంగా లాఠీ చార్జీ చేసి, కాల్పులకు పాల్పడటాన్ని సీఐటీయూ ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ శని, ఆదివారాల్లో అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాకేశ్ మృతికి సంతాపం, కుటుంబానికి ప్రగాఢ సానూభుతి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్మీలో నాలుగేండ్లు పనిచేసిన తర్వాత మూడొంతుల మందికి ఉద్వాసన పలికే చర్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని పెంచాయనీ, దీంతో మూడురోజు లుగా 8 రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.