Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిపుల్‌ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు చక్రధర్‌రావు, ప్రధాన కార్యదర్శి హరగోపాల్,కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మినారా యణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.విద్యార్థులతో తక్షణమే చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర విద్యార్థులతో ప్రత్యక్షంగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.