Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు అనురిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్టతకు భంగం వాటిల్లుతున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని కేసీఆర్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారనీ, నేడు అది నిజం అవుతున్నదని తెలిపారు. స్విస్ బ్యాంకు నుంచి తెస్తానన్న నల్లధనం ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీతో వ్యాపారులు నష్టపోతున్నారని వాపోయారు. నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టి చివరకు పీఎం క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. రక్షణ శాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకొచ్చిన మోడీ ఇపుడు అగ్నిపథ్ తో కాంట్రాక్టు విధానం తెచ్చారని విమర్శించారు. ఇప్పుడు అగ్నిపథ్తో దేశ యువత రోడ్లపైకి నిరసన తెలుపుతున్నదన్నారు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందనీ, ఆ పార్టీకి ఇక గడ్డుకాలమేనని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పోలీసుల ఆధీనం లో ఉంటుందనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘటనకు సంబంధం లేదని తెలిపారు.