Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఆర్టీసీ నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర, జిల్లా స్థాయి రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు రూ. 800 కోట్ల రుణాన్ని సేకరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నిధులను ఏదైనా బ్యాంకు నుంచి రుణప్రాతిపదికన సమకూర్చుకోవాలని భావిస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లోని రోడ్లు భవనాల శాఖ టీఎస్ ఆర్డీసీ తొలిసారి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు 14వ సమావేశం జరిగింది. దీనికి ఉన్నతాధికారులతోపాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఒక ప్రతినిధి హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఎస్ ఆర్డీసీకి సంబంధించిన 2022-23 వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన రహదారుల నిర్మాణంపై సుదీర్ఘంగా బోర్డు చర్చించింది. ఈ రహదారుల నిర్మాణానికి రూ.800 కోట్లు రుణం తీసుకోవాలన్న ప్రతిపాదనకు బోర్డు అంగీకారం తెలియజేసింది. ఈ మేరకు పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులను సంప్రదించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్)ను తయారుచేయాలని సంబంధిత శాఖ సన్నాహాలు చేస్తున్నది.